వైఎస్ షర్మిల దీక్షకు హైకోర్టు అనుమతి

వైఎస్ షర్మిల దీక్షకు హైకోర్టు అనుమతి

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల నిరాహార దీక్షకు హైకోర్టు అనుమతిచ్చింది. వైఎస్సార్ టీపీ ఆధ్వర్యంలో  అఖిలపక్షంతో కలిసి టీ సేవ్ పేరుతో దీక్ష చేయనున్నారు షర్మిల.  అయితే దీక్షకు 48 గంటల ముందు పోలీసులకు  సమాచారం ఇవ్వాలని సూచించింది. అలాగే ఈ నిరాహార దీక్షకు 500 మంది కంటే ఎక్కువ మందిని  తీసుకరావొద్దని షరతు పెట్టింది. ప్రతిపక్ష పార్టీలతో కలిసి షర్మిల ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష నిర్వహించాలనుకున్నారు.  కానీ శాంతిభద్రతల దృష్యా  దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో షర్మిల హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై ఏప్రిల్ 21న విచారణ జరిపిన కోర్టు షర్మిల దీక్షకు షరతులతో కూడిన అనుమతిచ్చింది.

నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీ, తెలంగాణ జనసమితి, జనసేన, బీఎస్పీ, సీపీఐ,సీపీఎం, ఎమ్మాఆర్ పీఎస్  లతో పాటు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు తమతో కలిసి రావాలని షర్మిల లేఖలో కోరిన సంగతి తెలిసిందే.  నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ప్రతిపక్షాలంతా ఏకతాటి మీదకు రావాల్సిన అవసరం వచ్చిందన్నారు.. సర్కారుపై నిరుద్యోగ సైరన్ మోగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జెండాలు వేరైనా ఒకే అజెండాగా ఏకమైన పార్టీలు.. నేడు స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం మళ్లీ ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు షర్మిల. 1200మంది ఆత్మబలిదానాల మీద ఏర్పడిన తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. బిస్వాల్ కమిటీ 1.91 లక్షల ఖాళీలు ఉన్నాయని తేల్చి చెబితే, KCR మాత్రం 80వేల ఖాళీలు మాత్రమే ఉన్నాయని ప్రకటించారని.. అవి కూడా భర్తీ చేయడం లేదని విమర్శించారు. ఇచ్చిన నోటిఫికేషన్లలో ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.

 షర్మిల లేఖ రాసిన వారిలో   బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ , తెలంగాణ పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి,  టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రావు,వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండ రాం,ఎమ్మా్ర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. 

https://www.youtube.com/watch?v=PWqIq5Kb70I