- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ నియామకంపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సీఈఓ నియామకం చేపట్టే ఉద్దేశం ఉందా? లేదా తెలియజేయాలని పేర్కొంది. వక్ఫ్ బోర్డుకు సీఈఓను నియమించకపోవడాన్ని సవాల్ చేస్తూ సయ్యద్ ఇఫ్తికార్ హుస్సేని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ అప్పీల్‌పై వాదనలు విన్న కోర్టు..బోర్డుకు పూర్తిస్థాయి సీఈఓ నియామకం చేపట్టే ఉద్దేశం ఉందా? ఉంటే ప్రక్రియ ఎక్కడివరకు వచ్చిందో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 9కు వాయిదా వేసింది.
