కేసుల సత్వర పరిష్కారానికి టెక్నాలజీని వాడుకోండి : అలోక్ ​అరాధే

కేసుల సత్వర పరిష్కారానికి టెక్నాలజీని వాడుకోండి : అలోక్ ​అరాధే
  •     హైకోర్టు చీఫ్ ​జస్టిస్​ అలోక్ ​అరాధే
  •     కూకట్​పల్లిలో కోర్టు కాంప్లెక్స్  ఓపెనింగ్ 

కూకట్​పల్లి, వెలుగు : ​కేసుల సత్వర పరిష్కారానికి టెక్నాలజీని వినియోగించుకోవాలని, రాష్ట్ర హైకోర్టు చీఫ్​జస్టిస్​అలోక్​అరాధే న్యాయమూర్తులు, సిబ్బందికి సూచించారు. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వివాదాలకు తావు లేకుండా తీర్పులు ఇస్తేనే  కోర్టులపై ప్రజలకు గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.  కూకట్​పల్లి హౌసింగ్​బోర్డు కాలనీలో కొత్తగా ధర్మశాల పేరుతో నిర్మించిన మేడ్చల్​జిల్లాలోని కూకట్​పల్లి, బాలానగర్, రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి సివిల్, ఫ్యామిలీ, క్రిమినల్​కోర్టుల కాంప్లెక్స్ ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.

వీలైనంత త్వరగా తీర్పులను వెల్లడించినప్పుడే కక్షిదారులకు న్యాయం జరినట్టు భావిస్తారని అన్నారు.  కార్యక్రమంలో హైకోర్టు జడ్జిలు జస్టిస్​లక్ష్మణ్​, జస్టిస్​విజయసేన్​రెడ్డి, జస్టిస్​శ్యామ్​ఖోస్, జస్టిస్​ అభినందన కుమార్​శావలి, జస్టిస్​వినోద్​కుమార్, జస్టిస్​బాలభాస్కర్, జస్టిస్​శశిధర్​రెడ్డి, మేడ్చల్​ జిల్లా కలెక్టర్​గౌతమ్​పోట్రు, సైబరాబాద్​ పోలీసు కమిషనర్​అవినాశ్​మహంతి, మేడ్చల్​అడిషనల్ కలెక్టర్  విజయేందర్​రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.