హైదరాబాద్, వెలుగు: ఎంబీఏ ప్రవేశాలపై ఐఐఎం ముంబై అడ్మిషన్ల వివాదంలో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మొత్తం పర్సంటైల్‌ను ఎంపికకు ప్రామాణికంగా తీసుకోవాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ప్రవేశ విధానంలో అంశాల వారీగా కటాఫ్ మార్కులు నిర్దేశించడం సముచితమని, అది ఏకపక్ష నిర్ణయం కాదని తెలిపింది. క్యాట్లో 99.52 పర్సంటైల్ సాధించినప్పటికీ తనను ఎంబీఏ ప్రవేశాల కోసం ఇంటర్వ్యూకు పిలవలేదని విద్యార్థి కటారు సత్యసాయి వేసిన పిటిషలో హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
