రామంతపూర్ చెరువు ఎఫ్‌‌టీఎల్‌‌పై నోటిఫికేషన్‌‌ ఇవ్వరా?

రామంతపూర్ చెరువు ఎఫ్‌‌టీఎల్‌‌పై నోటిఫికేషన్‌‌ ఇవ్వరా?

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌లోని రామంతాపూర్‌‌‌‌లో 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు ఎఫ్‌‌టీఎల్‌‌ నిర్ధారణ నోటిఫికేషన్‌‌ ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నోటిఫికేషన్‌‌కు సంబంధించి ప్రభుత్వ శాఖలు పరస్పర ఆరోపణలకు దిగుతుండటంపై మండిపడింది. రెవెన్యూ శాఖ సహకరించడం లేదని జీహెచ్‌‌ఎంసీ, హెచ్‌‌ఎండీఏలు.. ఈ రెండు శాఖలు కొపరేట్‌‌ చేయడం లేదని రెవెన్యూ డిపార్ట్‌‌మెంట్‌‌ చెప్పడంపై ఫైర్‌‌‌‌ అయింది. అన్ని శాఖల ఆఫీసర్లను కోర్టుకు పిలిపిస్తే వ్యవహారం దారికి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. హెచ్‌‌ఎండీఏ, ప్రైవేట్‌‌ వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చి వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారిస్తామని చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ అనిల్‌‌ కుమార్‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రామంతాపూర్‌‌లోని 25 ఎకరాల్లోని పెద్దచెరువును డంపింగ్‌‌ యార్డుగా మార్చి దుర్గందభరితంగా మారు స్తున్నారంటూ ఓయూ ప్రొఫెసర్‌‌ కేఎల్‌‌ వ్యాస్‌‌ 2005లో హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని సుమోటో పిల్‌‌గా పరిగణించి కోర్టు విచారణ చేపట్టింది.