ప్రభుత్వ విద్యా సంస్థలో వసతులపై నివేదిక ఇవ్వాలె

ప్రభుత్వ విద్యా సంస్థలో వసతులపై నివేదిక ఇవ్వాలె

ప్రభుత్వ విద్యా సంస్థలో వసతులపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వసతుల మెరుగుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని కోర్టు వెల్లడించింది. సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని సమస్యలపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. ఎల్‌ఎల్‌బీ విద్యార్థి మణిదీప్ లేఖ ఆధారంగా సుమోటో విచారణ జరిపింది. కాలేజీలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అమ్మాయిలకు తగిన వసతులు కల్పించాలన్న కోర్టు.. సీఎస్, విద్యా శాఖ కార్యదర్శి, ఇంటర్ విద్య కమిషనర్‌కు నోటీసులు పంపింది. ఏప్రిల్ 25లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.