బాల్క సుమన్ కు బెయిల్ షరతులతో మంజూరు చేసిన హైకోర్టు

బాల్క సుమన్ కు బెయిల్ షరతులతో మంజూరు చేసిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌‌‌‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌‌‌‌ మంజూరు చేసింది. సుమన్‌‌‌‌ దాఖలు చేసిన బెయిల్‌‌‌‌ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ కె. సుజన బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి భవన్ కు చెందిన జూనియర్‌‌‌‌ ఇన్ స్పెక్టర్‌‌‌‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సుమన్​పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

గత మే 26న హైదరాబాద్‌‌‌‌లోని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ భవన్ లో బాల్క సుమన్  చేసిన ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉందని, సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయడం, అగ్నిప్రమాదాలకు పాల్పడడం, రైల్వే పట్టాలను దెబ్బతీయడం వంటి చర్యలను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో బాల్క సుమన్ ను మే 30న అరెస్టు చేసి జ్యుడీషియల్‌‌‌‌ కస్టడీకి తరలించారు. బెయిల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌పై విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనల విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్‌‌‌‌ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.