సుహ్ల్ (జర్మనీ): ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ షూటింగ్‌చాంపియన్‌షిప్‌లో ఇండియా షూటర్ల గురి అదిరింది. మంగళవారం రాత్రి జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో వాన్షిక చౌదరీ–శివ నర్వాల్ జోడీ 469.7 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకుంది.
పోలెండ్ ద్వయం మల్గోర్జాత డాబ్రోవాస్కా–ఇవాన్ రాకిట్‌స్కి (471.9), చైనీస్ తైపీ షూటర్లు చెంగ్ యెన్‌చింగ్–సీహ్ సియాంగ్ చెన్ (410) వరుసగా స్వర్ణం, కాంస్యం సాధించారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇండియా పతకాల సంఖ్య 16కు చేరింది. ఇందులో ఐదు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి.
