టొరంటో: వరల్డ్ కప్‌లో క్రొయేషియా నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. గ్రూప్–ఎల్ మ్యాచ్‌లో క్రొయేషియా 1–0తో పనామాను ఓడించింది. ఈ ఓటమితో పనామా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ 54వ నిమిషంలో జోసిప్ స్టానిసిచ్ అందించిన పాస్‌ను సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన బుడిమిర్ గోల్‌గా మలిచాడు. గ్రౌండ్‌లోకి వచ్చిన నాలుగు నిమిషాల్లోనే గోల్ కొట్టడం విశేషం.
క్రొయేషియా స్టార్ ప్లేయర్ లుకా మోడ్రిచ్‌కు ఇది 200వ మ్యాచ్ కావడం గమనార్హం. 57వ నిమిషంలో మోడ్రిచ్ ఇచ్చిన పాస్‌ను మార్కో పసాలిచ్ గోల్‌గా మలచలేకపోయాడు. పనామా కీపర్ ఒర్లాండో మోస్క్వెరా అడ్డుకున్నాడు. 67వ నిమిషంలో పనామాకు వరుసగా మూడు గోల్స్ చేసే చాన్స్ వచ్చింది. కానీ క్రొయేషియా గోల్ కీపర్ డొమినిక్ లివకోవిచ్ నిలువరించాడు.
