
హైదరాబాద్, వెలుగు: నిర్మల్, ఖానాపూర్ లో హనుమాన్ విజయయాత్ర నిర్వహణకు షరతులతో అనుమతి ఇవ్వాలని సంబంధిత జిల్లా పోలీసులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ర్యాలీ నిర్వహించాలి. వంద బైక్‌లకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. డీజే సౌండ్స్ వాడకూడదు. మత, రాజకీయ, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు’’ అని షరతులు విధించాలని పోలీసులకు స్పష్టం చేసింది. వీర హనుమాన్ విజయయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ వేర్వేరుగా వేసిన పిటిషన్లను జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి విచారించి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు.