కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై విచారణ వాయిదా

కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై విచారణ వాయిదా

కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు సంబంధించి కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 13లోపు ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పాలని ఆదేశించింది. రైతులను సంప్రదించకుండానే మాస్టర్ ప్లాన్ను రూపొందించారని పాల్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పిటిషనర్ వాదనలు విన్న న్యాయస్థానం తన నిర్ణయం చెప్పాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది.