కోర్టులో ప్రభుత్వ భూమి అని బోర్డు ఎట్ల పెడ్తరు?..కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయకపోతే సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పిలుస్తం

కోర్టులో ప్రభుత్వ భూమి అని బోర్డు ఎట్ల పెడ్తరు?..కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయకపోతే సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పిలుస్తం

హైదరాబాద్, వెలుగు: ఒక భూమి తమదేనని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టులో బోర్డు ఏర్పాటు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జడ్జికి తెలియజేయకుండా, నోటీసు ఇవ్వకుండా కోర్టు ఆవరణలో బోర్డు ఎలా ఏర్పాటు చేశా రని మారేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి రెవెన్యూ ఆఫీసర్లను ప్రశ్నించింది. నేడు సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టులో బోర్డు పెట్టిన ప్రభుత్వం రేపు హైకోర్టులో ఫలానా భూమి తమదేనని బోర్డు పెట్టదని గ్యారెంటీ ఏముందని నిలదీసింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నోటీసు ఇస్తే ఇప్పటి దాకా అధికారులు కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయకపోడంపై మండిపడింది.

జులై 25 లోగా కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని, లేకపోతే సీఎస్​తో పాటు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి. ఇతర రెవెన్యూ అధికారులు స్వయంగా హాజరుకావాల్సివుంటుందని హెచ్చరించింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1న మారెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి ఎమ్మార్వో పోలీసులను వెంటబెట్టుకుని సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టులో బో ర్డు ఏర్పాటు చేయడంపై సిటీ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టు చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి పంపిన రిపోర్టును హైకోర్టు సుమోటో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప=రిగణించింది. దీనిని గురువారం చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.తుకారాంజీతో కూడిన డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురువారం విచారణ జరిపింది. హైకోర్టు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6న నోటీసులు జారీ చేసినా ఇప్పటి వరకు కౌంటర్లు ఎందుకు దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కోర్టు ఆవరణలో బోర్డు ఏర్పాటు చేసిన ఆఫీసర్లంతా విచారణకు హాజరుకావాలని ఆదేశాలిస్తామని హెచ్చరించింది. సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్టు జడ్జికి కూడా చెప్పకుండా బోర్డు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. విచారణను జులై 25వ తేదీకి వాయిదా వేసింది.