డెక్కన్ హోటల్ కూల్చివేతపై హైకోర్టు సీరియస్

డెక్కన్ హోటల్ కూల్చివేతపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్  ఫిల్మ్ నగర్ లోని డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతపై  హైకోర్టు సీరియస్ అయ్యింది. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తో పాటు మరికొందరి అధికారులకు నోటీసులు జారీ చేసింది.  జులై 11న కోర్టు ముందు హాజరవ్వాలంటూ ఆదేశించింది.

2022 నవంబర్ 13న డెక్కన్ హోటల్ ను కూల్చేశారు జీహెచ్ఎంసీ అధికారులు.  అయితే  8 వారాల పాటు ఎలాంటి  ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా  జీహెచ్ఎంసీ అధికారులు డెక్కన్ హోటల్ ను కూల్చేశారు.  కోర్టులో కేసు నడుస్తున్నా అక్రమంగా తన హోటల్ ను కూల్చివేశారని నందన్ కుమార్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. విచారించిన హైకోర్టు జీహెచ్ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హోట్ కూల్చొద్దని  నవంబర్ 11న ఆదేశాలిస్తే 13న ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవితేజ, టౌన్ ప్లానింగ్ అధికారి రాజ్ కుమార్ లకు నోటీసులు జారీ చేసింది.  తదుపరి విచారణను జులై 11 కు వాయిదా వేసింది.