ఎస్సీ వర్గీకరణ చట్టంపై కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయండి,,రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు నోటీసులు

ఎస్సీ వర్గీకరణ చట్టంపై కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయండి,,రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ షెడ్యూల్డ్‌‌‌‌‌‌‌‌ కులాల(రిజర్వేషన్ల సర్దుబాటు) చట్టం–2025పై కౌంటర్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ చట్టాన్ని సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూ మాల మహానాడు తరఫున అధ్యక్షుడు జి చెన్నయ్య, షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ కులాల ఐక్య వేదిక తరఫున ఉపాధ్యక్షుడు గడ్డం శంకర్‌‌‌‌‌‌‌‌ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను బుధవారం హైకోర్టు  విచారించింది. తొలుత పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ వర్గీకరణ చట్టంతోపాటు దాని అమలుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 33, జీవో 9, 10, 99 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పిటిషనర్లు చట్టాన్ని సవాల్‌‌‌‌‌‌‌‌ చేసిన కేసుల్లో కోర్టులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆస్కారాలు చాలా అరుదుగా ఉంటాయని స్పష్టం చేసింది. ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.