హైదరాబాద్, వెలుగు: ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై నమోదైన నాలుగు కేసులను కొట్టివేయాలని సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పోలీసులతో పాటు ఫిర్యాదుదారులైన డిప్యూటీ ఈఈ పి. ప్రవీణ్‌కుమార్, సర్వే ఇన్‌స్పెక్టర్ ఎం. నరేందర్, ఎంసీసీ-1 డాక్టర్ పి. పెంట య్య, డిప్యూటీ ఈఈ ఎం. పవన్ కుమార్‌లకూ నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది.
ఈ కేసు లపై జస్టిస్ కె. సుజన విచారణ చేపట్టారు. 2019లో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి పద్మా వతికి మద్దతుగా రోడ్డు షోలు, నిర్వ హించారని ఆరోపిస్తూ ఉత్తమ్, రేవంత్ సహా , కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసులతో పాటు ఫిర్యాదుదారులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.
