- రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆర్డర్స్
హైదరాబాద్, వెలుగు: కోర్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ను వారి అర్హతలను బట్టి సంబంధిత ఉద్యోగాల్లో రెగ్యులరైజ్ చేయాలని హైకోర్టు సోమవారం జడ్జిమెంట్ చెప్పింది. పదేండ్ల నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను ఆదే విధంగా కొనసాగించడం సబబు కాదని సూచించింది. వారి సర్వీసు క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, రాష్ట్ర సర్కార్‌లను ఆదేశించింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను 2021, ఏప్రిల్ 1న హైకోర్టు పాలనా విభాగం తొలగించింది. ఈ చర్యను సవాల్ చేస్తూ 200 మందికిపైగా ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. వేర్వేరుగా దాఖలు చేసిన ఎనిమిది పిటిషన్లపై జస్టిస్ నవీన్‌రావు, జస్టిస్ బి.నగేశ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ పూర్తి చేసి సోమవారం తీర్పు వెలువరించింది. క్లర్క్, టైపిస్టు, సబార్డినేట్ పోస్టుల్లో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను నియమించాలని తీర్పులో పేర్కొన్నది.
