టి9 చాలెంజర్ సీజన్‌‌–4: విసాఫ్ట్‌‌ టైటాన్స్‌‌ మెరుపులు

 టి9 చాలెంజర్ సీజన్‌‌–4: విసాఫ్ట్‌‌ టైటాన్స్‌‌ మెరుపులు

హైదరాబాద్‌‌, వెలుగు: బౌల్డర్‌‌ హిల్స్‌‌ గోల్ఫ్‌‌ అండ్‌‌ కంట్రీ క్లబ్‌‌ వేదికగా జరుగుతున్న టి9 చాలెంజర్​  సీజన్‌‌–4లో సంచలనం నమోదైంది. పూల్‌‌–ఎలో విసాఫ్ట్ టైటాన్స్‌‌ క్లీన్‌‌ స్వీప్‌‌ చేయగా, టాప్‌‌లో ఉన్న పార్‌‌ టైమర్స్‌‌ పరాజయంపాలైంది. నాలుగో రౌండ్‌‌లో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న విసాఫ్ట్‌‌ టైటాన్స్‌‌ 10 పాయింట్లతో టాప్‌‌ ప్లేస్‌‌కు దూసుకెళ్లింది.

బంకర్ బస్టర్స్ 2.5 పాయింట్లతో మొత్తం 9.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. పార్ టైమర్స్ 9 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. దాసోస్ బై మహి (7 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలవగా.. శ్రీ మెట్రిక్స్ ఈగల్స్ (6.5), రాజపుష్ప ఇన్విక్టా (6) తదుపరి రౌండ్లలో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. పూల్–బిలో ఆర్డీ ఐరన్ ఈగల్స్ జట్టు స్థిరమైన ప్రదర్శనతో 10 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని కాపాడుకుంది.