వీఆర్వోల బదిలీలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

వీఆర్వోల బదిలీలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ : తాము వెలువరించే తుది తీర్పుకు లోబడే వీఆర్వోల బదిలీలు ఉండాలని రాష్ట్ర సర్కారుకు హైకోర్టు స్పష్టం చేసింది. జీవో121ను సవాలు చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన సీహెచ్‌‌‌‌‌‌‌‌ నాగేంద్రబాబు, ఇతరులు హైకోర్టులో రిట్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. దానిపై బుధవారం జస్టిస్‌‌‌‌‌‌‌‌ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. బదిలీ అయిన వీఆర్వోలు చేయాల్సిన పనులు.. విధి విధానాలపై సర్కారు స్పష్టత ఇవ్వలేదని పిటిషనర్ తరఫు లాయర్ పవన్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌  కోర్టుకు తెలిపారు. వీఆర్వోలు రెవెన్యూ శాఖలోనే కొనసాగుతున్నారని వివరించారు.

వీఆర్వోల సేవలను అవసరమైన చోట్ల వినియోగించుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రామారావు కోర్టుకు విన్నవించారు. ఇది విధానపరమైన నిర్ణయమని.. జిల్లాల్లోని ఇతర శాఖలకు వీఆర్వోలను బదిలీ చేస్తామని చెప్పారు. ఎవరి ఉద్యోగానికి నష్టం ఉండదని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు.. వీఆర్వోలను ఇతర శాఖలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో 121ను అడ్డుకోలేమని తెలిపింది. కానీ, తాము వెలువరించే తుది తీర్పుకు లోబడే బదిలీలుంటాయని పేర్కొంది. అనంతరం విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.