
రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అదృష్యమైన మైనర్ బాల బాలికల కేసులను రీ ఓపెన్ చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు లాయర్ రాపోలు భాస్కర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) లో ఫిర్యాదు చేశారు. 2015-2018 మధ్య మిస్ అయిన బాల బాలికల కేసులను రీ ఓపెన్ చేసేలా ఆర్డర్ ఇవ్వాలని HRCని కోరారు. ప్రతీ సంవత్సరం 13000 మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయని అందులో మూడు నుంచి నాలుగు వేల కేసులు మైనర్ పిల్లలవేనని తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం .. హాజీపూర్ లో మైనర్ బాలికలను ఎలా అయితే నమ్మించి హతమార్చారో.. అదృశ్యమైన మైనర్ బాలికలపై కూడా ఇదే తరహా లో అఘాయిత్యాలు జరిగి ఉంటాయని ఆయన ఫిర్యాదులో ఆందోళన వ్యక్తం చేశారు. ర్రాష్ట్ర వ్యాప్తంగా క్లోజ్ చేసిన 2 వేల కేసులను తిరిగి విచారణ జరిపించాలని కోరారు.