360 కోట్లను డిపాజిట్‌‌ చేయాల్సిందే.. హెచ్‌‌ఎండీఏకు హైకోర్టు ఆదేశం

360 కోట్లను డిపాజిట్‌‌  చేయాల్సిందే.. హెచ్‌‌ఎండీఏకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు : ఔటర్‌‌ రింగ్‌‌ రోడ్‌‌ కాంట్రాక్ట్‌‌ వ్యవహారంలో వాణిజ్య కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది.  కాంట్రాక్టర్‌‌ సైబరాబాద్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌వే లిమిటెడ్‌‌కు రూ.360 కోట్లను12 శాతం వడ్డీతో చెల్లించాలన్న ఆర్బిట్రేషన్‌‌ ట్రిబ్యునల్‌‌ ఇచ్చిన ఉత్తర్వులను హెచ్‌‌ఎండీఏ హైకోర్టులో సవాల్‌‌ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థను డిపాజిట్‌‌ చేయమని ఆదేశించడం అన్యాయమనే వాదనను హైకోర్టు తప్పుపట్టింది. 

ఫామ్‌‌ డెవలప్ మెంట్ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కేసులో  సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ అయినాసరే డిపాజిట్‌‌ చేయాలని చెప్పింది. మొత్తంలో  సగభాగం  వాణిజ్య కోర్టుకు డిపాజిట్‌‌ చేయాలని హెచ్‌‌ఎండీఏను ఆదేశించింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ ఎన్‌‌వీ శ్రవణ్‌‌కుమార్‌‌ల బెంచ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.