స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు..బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు..బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
  • విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: అసెంబ్లీ సమావేశాల టైంలో స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, ఎన్‌‌‌‌‌‌‌‌.నవీన్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. స్పీకర్‌‌‌‌‌‌‌‌ను దూషించారనే ఆరోపణలపై అరెస్టయిన ఎమ్మెల్సీలకు రిమాండ్‌‌‌‌‌‌‌‌ నిరాకరిస్తూ ఈ నెల 8న కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు సోమవారం విచారించింది.

పోలీసుల తరఫున పీపీ వాదిస్తూ.. స్పీకర్‌‌‌‌‌‌‌‌ కులం తెలిసే ఉద్దేశంతోనే ఆయనను కించపరిచేలా ఎమ్మెల్సీలు వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఆరుగురు సాక్షుల వాంగ్మూలాలతోపాటు వీడియో ఫుటేజీలను సేకరించి కోర్టుకు సమర్పించినట్లు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తాతా మధుసూదన్, ఎన్‌‌‌‌‌‌‌‌.నవీన్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డిలకు నోటీసులు జారీ చేసి, విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు.