సెప్టెంబర్ 22 చాలా విశిష్టమైన రోజు.. ఈ రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు..

సెప్టెంబర్ 22 చాలా విశిష్టమైన రోజు.. ఈ రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు..

హిందూ పంచాగం ప్రకారం.. బాధ్రపదమాసం.. గణపతి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి.    ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి.. ప్రతి ఏకాదశికి  చాలా విశిష్టత ఉంది. బాధ్రపదమాసం శుక్ష పక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన  ఏకాదశి అంటారు.  ఈ ఏడాది ( 2026) సెప్టెంబర్​ 22  మంగళవారం రోజున పరివర్తన ఏకాదశి వచ్చింది.  ఆరోజు  విశిష్టత ఏంటి.. ఆరోజు ఏంచేయాలి.. ఏం చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

 ఆషాఢ శుద్ధ ఏకాదశి  రోజున శేష శయ్యపై యోగ నిద్రలోకి వెళ్లిన  శ్రీమహావిష్ణువు....భాద్రపద శుద్ధ  ఏకాదశి ( 2026 సెప్టెంబర్ 22) రోజున ఎడమ వైపు నుంచి కుడి వైపునకు తిరుగుతాడని పండితులు చెబుతున్నారు. అలా యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఒక వైపు నుంచి మరో వైపుకి  మారి.. పరివర్తనం చెందే ఏకాదశి కనుక, దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు.   

 
పరివర్తిని ఏకాదశి ఈ ఏడాది సెప్టెంబర్ 22 న జరుపుకుంటారు. 

  • 2026  పరివర్తన ఏకాదశి తిథి ప్రారంభం :  సెప్టెంబర్​ 21 రాత్రి 8 గంటలకు
  • 2026  పరివర్తన ఏకాదశి తిథి ముగింపు:   సెప్టెంబర్ 22 రాత్రి 9గంటల43 నిమిషాలకు
  • పరివనర్తన ఏకాదశి వ్రతం, ఉపవాసం:  సూర్యోదయ ఉదయ తిథి ప్రామాణికం సెప్టెంబర్ 22వ తేదీ

పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ  ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజించి ... ఉపవాసదీక్షను పాటిస్తే  జీవితంలో ఆనందం.. ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు. పరివర్తన ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే... పెండింగ్​ లో ఉన్న పనులు పూర్తవుతాయి.  

పూజావిధానం..

 

  • ఉదయాన్నే స్నానం చేసి శుబ్రమైన బట్టలు ధరించాలి.. మడి బట్టలు ధరిస్తే చాలా మంచిది. 
  • పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించుకోవాలి.  పూజామందిరంలో విష్ణుమూర్తి ఫొటో ఉంటే ప్రత్యేకంగా అవసరం లేదు. 
  • విష్ణుమూర్తికి పచ్చని పూలతో..పూల దండ  సమర్పించాలి. 
  • సంకల్పం చెప్పుకొని కోరికలు తీరాలని.. భక్తితో పూజ చేయాలి.  విష్ణు సహస్రనామం పఠించాలి.. లేదా.. వినాలి.  
  •  పూజలో కచ్చితంగా తులసి దళాలు ఉండాలి.  ( ఈరోజే సెప్టెంబర్​ 21నే కోసి పెట్టుకోండి.. రేపు అస్సలు కోయకూడదు)
  • ధూపం.. దీపం.. నైవేద్యం సమర్పించాలి. పచ్చని పండ్లను స్వామివారికి సమర్పించాలి. 
  • ఉపవాస దీక్షను పాటించాలి. విష్ణువుకు సంబంధించిన మంత్రాలను జపించాలి.  
  • కృష్ణావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువుకు వెన్న, కలకండ (పటిక బెల్లం) నైవేద్యంగా పెట్టడం వల్ల ..  అన్ని కోరికలు నెరవేరుతాయని  పండితులు అంటున్నారు.
  • విష్ణువుతోపాటు లక్ష్మీదేవి, వినాయకుడిని పూజిస్తే అదృష్టం  కలసివస్తుంది. 
  • నిరుపేదలకు పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి. 

ఓం వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ
 పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ”

అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని యధాశక్తి పూజించడం వలన, అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెబుతున్నారు. 

పరివర్తన ఏకాదశికి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినదిగా కూడా పరిగణిస్తారు. కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు.  ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడని వేదాలు చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన.. ఉపవాసం ఉండటం వలన  బ్రహ్మ -విష్ణు -మహేశ్వరులని సేవిస్తే .. ఎంతటి ఫలితం ఉంటుందో అంతటి  ఫలితం లభిస్తుందని  పురాణాలు  చెబుతున్నాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.