కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు

కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు
  • ఎమ్మెల్యేగా ఆయన ఎన్నిక చెల్లదంటూ కేకే మహేందర్ రెడ్డి, మరో వ్యక్తి పిటిషన్లు 
  • కొడుకుకు ఆస్తులు ఎట్లొచ్చాయో కేటీఆర్ చెప్పలేదని అభ్యంతరం
  • విచారణ నాలుగు వారాలకు వాయిదా 

హైదరాబాద్, వెలుగు : సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్​కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేగా కేటీఆర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డితోపాటు లగిశెట్టి శ్రీనివాసులు అనే మరో వ్యక్తి విడివిడిగా దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు జడ్జి జస్టిస్‌ నామవరపు రాజేశ్వరరావు శుక్రవారం విచారించారు. కేసులో ప్రతివాదులైన కేటీఆర్, రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రిటర్నింగ్‌ అధికారి ఆర్డీవో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్‌ దాఖలు చేసిన ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన కొడుకు కె. హిమాన్షు పేరిట ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పలేదని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. 

తనపై భార్య, మైనర్‌‌‌‌‌‌‌‌ కుమార్తె మాత్రమే ఆధారపడ్డారని అఫిడవిట్​లో కేటీఆర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారని, గత ఏడాది జులైలో మేజర్‌‌‌‌‌‌‌‌ అయిన హిమాన్షు తనపై ఆధారపడలేదని తెలిపారన్నారు. అయి తే, సిద్దిపేట జిల్లా మర్కూక్‌‌‌‌‌‌‌‌ మండలం వెంకటా పూర్‌‌‌‌‌‌‌‌లో 4 ఎకరాలు, ఎర్రవల్లిలో 32.15 ఎక రాలు కొనుగోలు చేసినందుకు హిమాన్షు వరు సగా రూ.10.50 లక్షలు, రూ.88.15 లక్ష లు చెల్లించాడని.. గత ఏడాదే మేజర్‌‌‌‌‌‌‌‌ అయిన అతడికి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఆర్థిక సాయం లేకుండా అం త డబ్బు ఎలా వస్తుందని పేర్కొన్నారు. అఫిడవిట్​లో నిజాలు దాచిన కేటీఆర్​ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. వాదనల అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.