
హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్ సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ప్రశ్నించింది. ఈమేరకు రాష్ట్రానికి నోటీసులు జారీ చేసింది.
220 సర్పంచ్‌లు, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, 344 ఉప సర్పంచ్‌లు, 5364 వార్డు మెంబర్స్ పదవులు ఏండ్లుగా ఖాళీగా ఉన్నా ఉప ఎన్నికలు నిర్వహించడం లేదంటూ లాయర్ రాపోలు భాస్కర్ పిల్ దాఖలు చేశారు. ఆ పదవులకు ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయవాది రంగయ్య వాదించారు. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 27కి వాయిదా వేసింది.