చెరువు భూముల్లో నిర్మాణాలు ఆపండి..రాష్ట్ర సర్కార్​కు హైకోర్టు నోటీసులు

చెరువు భూముల్లో నిర్మాణాలు ఆపండి..రాష్ట్ర సర్కార్​కు హైకోర్టు నోటీసులు
  •     కోమటికుంట చెరువులో కన్​స్ట్రక్షన్స్​పై విచారణ

హైదరాబాద్, వెలుగు :  మేడ్చల్‌‌ మల్కాజ్‌‌గిరి జిల్లా నిజాంపేటలోని కోమటికుంట చెరువు భూముల్లో కన్​స్ట్రక్షన్స్ నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సర్కార్​ను హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మేడ్చల్ మల్కాజ్​గిరి కలెక్టర్‌‌, నిజాంపేట మున్సిపల్‌‌ కమిషనర్‌‌, ఇరిగేషన్ ఆఫీసర్లతో పాటు వాసవీ ఇన్‌‌ఫ్రా ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

ప్రైవేట్ బిల్డర్లతో చేతులు కలిపిన అధికారులు.. సర్వే నంబర్‌‌ 127, 137లోని చెరువు భూములు కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదంటూ సతీశ్‌‌ అనే సోషల్ వర్కర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషన్​పై చీఫ్ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ ఎన్వీ శ్రవణ్‌‌ కుమార్‌‌ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. వాదనల తర్వాత తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.