నౌబత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాయిలెట్స్ ఏర్పాటు చేయండి: హైకోర్టు ఆదేశం

నౌబత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాయిలెట్స్ ఏర్పాటు చేయండి: హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నౌబత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పహాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ఉన్న సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గాంధీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కోడి గుడిసెలు) ప్రాంతంలో టాయిలెట్స్ ఏర్పాటుకు తీసుకునే చర్యలు వివరించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆగస్టు 8లోగా ప్రతివాదులు కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయాలని పేర్కొంది. ఆ ప్రాంతంలో మహిళలకు మరుగుదొడ్లు లేవంటూ ఒక పత్రికలో వచ్చిన వార్తను హైకోర్టు సుమోటోగా పరిగణించి గురువారం విచారించింది. 

మరుగుదొడ్లు లేకపోవడంతో రాత్రిళ్లు మహిళలు దగ్గర్లోని కొండల్లోకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి గాయాల పాలవుతున్నారని పత్రికలో వచ్చింది. దీనిని పిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిగణించాలని న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టి.వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నివేదించారు. పగటి సమయంలో బహిర్భూమికి వెళ్లడం కష్టంగా ఉందని, దీనిపై అధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదంటూ బాధితుల ఆవేదనను చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.తుకారాంజీల డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిశీలించింది. దీంతో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ముఖ్యకార్యదర్శి జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అదనపు కమిషనర్, ఖైరతాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మరుగుదొడ్ల ఏర్పాటుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.