- మళ్లా కేసులు పెరుగుతున్నయ్ : హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర సర్కార్ రిపోర్టు ప్రకారం కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు తెలుస్తోందంది. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో కేసులు పెరుగుతున్నాయని.. దీన్ని రాష్ట్ర సర్కార్ సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది. ఫోర్త్ వేవ్ రాకుండా చర్యలు చేపట్టాలని, టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించింది. కరోనాపై ఫైల్ అయిన వేర్వేరు పిల్స్‌ను చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీల డివిజన్ బెంచ్‌బుధవారం మరోసారి విచారించింది.
