సింగరేణి పరీక్షలో అవకతవకలపై హైకోర్టు ఆదేశాలు

సింగరేణి పరీక్షలో అవకతవకలపై హైకోర్టు ఆదేశాలు

సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీని తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆపేయాలని హైకోర్టు ఆదేశించింది.  పరీక్షలు, విద్యార్హతలు ఇతర అంశాల్లో అవకతవకలు జరిగాయంటూ కొంతమంది అభ్యర్థులు  హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు..  పిటిషనర్లు తమ వాదనను బలపరిచే ఆధారాలను చూపించారని తెలిపింది. దీనిపై కోర్టు నుంచి తదుపరి నిర్ణయం వెలువడే వరకు భర్తీని నిలిపివేయాలని ఆదేశించింది. 

సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ -2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షను ఇటీవలే నిర్వహించారు. దానిపై అనేక ఆరోపణలు  వచ్చాయి. పరీక్ష జరిగే రోజునే కొంతమంది అభ్యర్ధులను గోవాకు తీసుకెళ్లి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారని, అక్కడే పేపర్‌ లీకైందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిని కొట్టిపారేసిన సింగరేణి యాజమాన్యం, జేఎన్‌టీయూ అధికారులు హడావుడిగా పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలను తాము సక్రమంగానే నిర్వహించామని వారు చెబుతున్నారు.