అనుమతులపై ఎన్‌‌ఎంసీకి అప్పీలు చేసుకోండి : హైకోర్టు

అనుమతులపై ఎన్‌‌ఎంసీకి అప్పీలు చేసుకోండి : హైకోర్టు
  • ఫాదర్‌‌ కొలంబో మెడికల్​ కాలేజీకి  హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: మెడికల్‌‌ కోర్సుల అడ్మిషన్ల అంశంపై ఎన్‌‌ఎంసీకి అప్పీలు చేసుకోవాలని వరంగల్‌‌లోని ఫాదర్‌‌ కొలంబో ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మెడికల్‌‌ సైన్సెస్‌‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ కాలేజీ సమర్పించిన అప్పీలుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఎన్‌‌ఎంసీకి ఉత్తర్వులు జారీచేసింది. 

కాలేజీ నిర్వహణకు అనుమతులు నిరాకరిస్తూ ఎన్‌‌ఎంసీ జారీ చేసిన ఉత్తర్వులను సింగిల్‌‌ జడ్జి సమర్థించడాన్ని సవాలు చేస్తూ ఇటీవల ఫాదర్‌‌ కొలంబో మెడికల్‌‌ కాలేజీ అప్పీలు దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌‌ అభినంద్‌‌కుమార్‌‌ షావిలి, జస్టిస్‌‌ వాకిటి రామకృష్ణారెడ్డితో కూడిన బెంచ్‌‌ బుధవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం.. అన్ని వివరాలతో మరోసారి ఎన్‌‌ఎంసీకి అప్పీలు చేసుకోవాలని కాలేజీకి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై 10 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఎన్‌‌ఎంసీని ఆదేశించింది.