భూ స్వాధీనం వ్యవహారంలో బలవంతపు చర్యలొద్దు ..రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం

భూ స్వాధీనం వ్యవహారంలో బలవంతపు చర్యలొద్దు ..రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం
  • మాజీ మంత్రి హరీశ్​రావు మామకు ఊరట

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు మామ మాధవరపు హనుమంతరావుకు చెందిన 3.22 ఎకరాల భూమి స్వాధీనం వ్యవహారంలో బలవంతపు చర్యలు తీసుకోరాదంటూ రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ భూమికి సంబంధించి ఇచ్చిన షోకాజ్‌‌‌‌‌‌‌‌నోటీస్​పై పూర్తి వివరాలతో కౌంటర్​దాఖలు చేయాలంటూ విచారణను నవంబర్​2కు వాయిదా వేసింది. వెలికట్టలోని 3.22 ఎకరాల స్వాధీనానికి గత నెల 29న ఇచ్చిన షోకాజ్‌‌‌‌‌‌‌‌ నోటీస్​ను సవాల్​చేస్తూ హనుమంతరావు హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు.

దీనిపై జస్టిస్‌‌‌‌‌‌‌‌ శ్రవణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌ న్యాయవాది రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. దురుద్దేశంతోనే నోటీస్​జారీ చేశారన్నారు. ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ.. షోకాజ్‌‌‌‌‌‌‌‌ నోటీస్​ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే రెవెన్యూ అధికారులు తదుపరి ప్రక్రియను కొనసాగించలేరని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి షోకాజ్‌‌‌‌‌‌‌‌నోటీస్​ఆధారంగా బలవంతపు చర్యలు తీసుకోరాదని ఆదేశించారు.