LRSపై 3 పిటిషన్లను విచారించిన హైకోర్టు

LRSపై 3 పిటిషన్లను విచారించిన హైకోర్టు

హైదరాబాద్ : ప్రభుత్వం తీసుకొచ్చిన LRSపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. LRSను రద్దు చేయాలంటూ హైకోర్టులో 3 పిటిషన్లు వేశారు. ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్,  కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టుకు వెళ్లారు. పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారిన ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అన్ని పిటిషన్లను కలిపి విడివిడిగా విచారించిన హైకోర్టు.. ప్రభుత్వ వివరణ తెలియకుండా స్టే ఇవ్వలేమని తెలిపింది. నవంబర్- 11న కౌంటర్ ధాఖలు చేస్తామని హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్.

రాష్ట్రంలో అక్రమంగా లే అవుట్లు లేకుండా చేయడం కోసం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను తీసుకొచ్చిందన్నారు ఏజీ. ఇల్లీగల్ ఎల్ఆర్ఎస్ రహిత రాష్టంగా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఎల్ఆర్ఎస్ ను తెలుకొచ్చామని చెప్పారు. వన్ టైం మేజర్ కింద అన్ని ఇల్లీగల్ ఎల్ఆర్ఎస్ ను రెగ్యులరైజ్ చేసి, భవిష్యత్తులో ఇల్లీగల్ ఎల్ఆర్ఎస్ లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు ఏజీ. పూర్తి వివరాలతో ఈ నెల 11న కౌంటర్ ధాఖలు చేస్తామన్నారు ఏజీ. దీంతో తదుపరి విచారణను ఈ నెల 12కి వాయిదా వేసింది హైకోర్టు.