రాష్ట్రంలో కరోనా గైడ్​లైన్స్​ ఎందుకు అమలు చేస్తలేరు?

రాష్ట్రంలో కరోనా గైడ్​లైన్స్​ ఎందుకు అమలు చేస్తలేరు?
  • కొత్తగా 4,559 కరోనా కేసులు
  • వైరస్‌‌‌‌తో మరో ఇద్దరు మృతి
  • కేసులు పెరుగుతున్నా పట్టించుకోరా: హైకోర్టు
  • విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని డీహెచ్ కు ఆదేశం

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. కొత్తగా 4,559 మంది వైరస్‌‌‌‌ బారిన పడ్డారని మంగళవారం హెల్త్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,43,354కు పెరిగాయని చెప్పింది. కరోనాతో మరో ఇద్దరు చనిపోగా, మరణాల సంఖ్య 4,077కు చేరిందని బులెటిన్‌‌‌‌లో చూపించింది. తాజాగా 1,961 మంది కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 7,03,008కు పెరిగాయని తెలిపింది. ప్రస్తుతం 36,269 యాక్టివ్‌‌‌‌ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఒక్కరోజులో 1,13,670 టెస్టులు చేయగా, ఇంకా 7,695 టెస్ట్‌‌‌‌ రిజల్ట్స్‌‌‌‌ రావాల్సి ఉందని తెలిపింది.
హైదరాబాద్, వెలుగు: కరోనా నియంత్రణకు కేంద్రం జారీ చేసిన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ఎందుకు సరిగా అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రోజురోజుకూ కేసులు భారీగా పెరుగుతున్నా రూల్స్ అమలు చేయకుంటే ఎలా అని అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్‌‌‌‌ఎంసీ, పోలీసు, ఇతర శాఖలు ఇప్పటికైనా రూల్స్ కఠినంగా అమలు చేయాలని సూచించింది. పిల్లలకు కరోనా వస్తే ఎదుర్కొనేలా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారో, పిల్లల వైద్యం కోసం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఏ మేరకు అమలు చేశారో చెప్పాలంది. నిలోఫర్‌‌‌‌ మినహా ఇతర చోట్ల ఎలాంటి ఏర్పాట్లు చేశారో స్వయంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని పబ్లిక్‌‌‌‌ హెల్త్​ డైరెక్టర్‌‌‌‌ను హైకోర్టు ఆదేశించింది. కరోనాపై దాఖలైన వేర్వేరు పిల్స్‌‌‌‌ను మంగళవారం చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ సతీశ్​చంద్రశర్మ, జస్టిస్‌‌‌‌ అభినంద్‌‌‌‌కుమార్‌‌‌‌ షావిలిల బెంచ్‌‌‌‌ విచారించింది. కేవలం మూడు రోజుల్లో 1.78 లక్షల మందికి జ్వర లక్షణాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించడంపై పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది కె. పవన్‌‌‌‌కుమార్‌‌‌‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందరికీ ఒకే తరహా మెడికల్‌‌‌‌ కిట్స్‌‌‌‌ ఇవ్వడంపై ఆయన అభ్యంతరం చెప్పారు. సర్కారు ఇస్తున్న మెడికల్‌‌‌‌ కిట్స్‌‌‌‌లో పిల్లలు వాడే మందులు లేవన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరూ మాస్కులు పెట్టుకోవడం లేదని, భౌతికదూరం ఎక్కడా పాటించడం లేదని మరో సీనియర్‌‌‌‌ న్యాయవాది ఎల్‌‌‌‌.రవిచందర్‌‌‌‌ చెప్పారు. ప్రభుత్వం లైట్​తీసుకుంటోందని, దీని వల్ల కరోనా కేసులు పెరిగే చాన్స్​ఉందన్నారు. దీనిపై స్పందించిన ఏజీ బీఎస్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, జ్వరంపై డోర్‌‌‌‌ టు డోర్‌‌‌‌ సర్వే చేస్తూ.. మందుల కిట్స్ ఇస్తోందన్నారు. పిల్లలకు సంబంధించి నిలోఫర్‌‌‌‌ ఇతర ఆస్పత్రుల్లో వైద్యం చేసేందుకు ఏర్పాట్లు జరిగాయని కోర్టుకు చెప్పారు. వాదనలు విన్న కోర్టు కరోనా ఏర్పాట్లకు సంబంధించి డీహెచ్‌‌‌‌ లేదా ఆయన తర్వాత స్థాయి ఆఫీసర్‌‌‌‌ విచారణకు రావాలని ఉత్తర్వులు జారీ చేసింది. కేసును ఈ నెల 28కి వాయిదా వేసింది.  

నైట్​ కర్ఫ్యూ పెట్టే పరిస్థితి లేదు: డీహెచ్
కేంద్రం గైడ్‌‌‌‌లైన్స్ ప్రకారం 10% పాజిటివ్‌‌‌‌ కేసులు లేదా ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్​40% రోగులతో నిండినా నైట్‌‌‌‌ కర్ఫ్యూ పెట్టాల్సి ఉంటుందని, అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవని మెడికల్‌‌‌‌ అండ్‌‌‌‌ హెల్త్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌రావు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్​లో పేర్కొన్నారు. ‘‘హాస్పిటల్స్​లో ఐసీయూ, ఆక్సిజన్‌‌‌‌ బెడ్స్‌‌‌‌పై చికిత్స పొందే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నెల17న ఐసీయూ, ఆక్సిజన్‌‌‌‌ బెడ్స్‌‌‌‌ ఆక్యుపెన్సీ 4.6 శాతం ఉంటే.23వ తేదీ నాటికి 6.1 శాతానికి పెరిగింది. కరోనా లేదా జ్వరం లక్షణాలు ఉన్న వారికి1.78 లక్షల మెడికల్‌‌‌‌ కిట్లు పంపిణీ చేశాం. 15- నుంచి 18 ఏండ్లలోపు వయసు ఉన్న 10,90,354 మందికి(59 శాతం) వ్యాక్సినేషన్‌‌‌‌ ఫస్ట్​డోస్‌‌‌‌ పూర్తయింది. ఫ్రంట్‌‌‌‌లైన్‌‌‌‌ వర్కర్లు 2.16 లక్షల మందికి ప్రికాషన్‌‌‌‌ డోస్‌‌‌‌ ఇచ్చాం” అని శ్రీనివాస్‌‌‌‌రావు అఫిడవిట్‌‌‌‌లో పేర్కొన్నారు.