ఎస్సీ కమిషన్‌‌ పోస్టుల భర్తీ ఇంకెన్నడు...ప్రభుత్వంపై హైకోర్టు అసహనం

ఎస్సీ కమిషన్‌‌ పోస్టుల భర్తీ ఇంకెన్నడు...ప్రభుత్వంపై హైకోర్టు అసహనం

హైదరాబాద్, వెలుగు : రాజ్యాంగబద్ధమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌లోని పోస్టులను ఖాళీగా ఉంచడం సరికాదని హైకోర్టు తెలిపింది. కనీసం ప్రభుత్వానికి నచ్చిన వ్యక్తులతోనైనా పోస్టులను భర్తీ చేయాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌ చైర్మన్, సభ్యుల నియామకానికి ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని గుర్తుచేసింది. 

మళ్లీ సమయం అడిగితే ఎలా అని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. పోస్టుల భర్తీకి ఇంకెంత గడువు కావాలని నిలదీసింది. తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేస్తూ చీఫ్‌‌ జస్టిస్‌‌ ఉజ్జల్‌‌ భూయాన్, జస్టిస్‌‌ తుకారాంజీ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.