
హైదరాబాద్, వెలుగు: అప్పీల్ పిటిషన్ విచారణలో ఉండగా కోర్టు ధిక్కరణ కేసు వేసేందుకు ఆస్కారం లేదని హైకోర్టు తెలిపింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్ 77లో ఉన్న 24 ఎకరాల భూమిని వేదిరి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌దని సింగిల్ జడ్జి గతంలో తీర్పు చెప్పారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై కలెక్టర్, తహసీల్దార్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దాన్ని జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ తాజాగా విచారించింది.