కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​బోర్డుకి హైకోర్టు షాక్

కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​బోర్డుకి హైకోర్టు షాక్

హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​బోర్డు (కేఆర్​ఎంబీ)కి హైకోర్టు షాక్​ ఇచ్చింది. బోర్డు ఉద్యోగులు, అధికారులు ఇన్సెంటివ్​ల రూపంలో పొందిన మొత్తం రిక వరీ చేయాలని చైర్మన్​ ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. కేఆర్​ఎంబీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల బేసిక్​పై 25%  ఇన్సెంటి వ్​గా ఇస్తున్నారు. 2020 నవంబర్ ​నుంచి ఈ ఇన్సెంటివ్​లు పొందుతున్నారు.

ఇలా 26 నెలల్లో ఉద్యోగులు పొందిన మొత్తాన్ని ఏకకాలంలో రికవరీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారుల ఒత్తిడితో చైర్మన్​ ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగులు పొందిన ఇన్సెంటివ్​లు తిరిగి చెల్లించాల్సి వస్తే కనిష్టంగా రూ.8 లక్షలు, గరిష్టంగా రూ.12 లక్షలు రీ పేమెంట్​చేయాల్సి ఉంటుంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఏకకాలంలో ఇన్సెంటివ్​లు తిరిగి చెల్లించాలనే ఆదేశాలు రద్దు చేసింది. దీనిపై తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.