- క్యాట్ ఉత్తర్వుల అమలును నిలిపివేసిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలిని తెలంగాణ కేడర్‌కు కేటాయించాలని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. క్యాట్ఉత్తర్వులను సవాలు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ పి.నరసింహశర్మ వాదిస్తూ.. ఆమ్రపాలి సమర్పించిన పరస్పర బదిలీ దరఖాస్తు నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు.
ప్రత్యూష్ సిన్హా కమిటీ, ఖండేల్కర్ కమిటీ సిఫారసుల ఆధారంగానే కేడర్ కేటాయింపులు జరిగాయని వివరించారు. ఆమ్రపాలి తరపు సీనియర్ న్యాయవాది వాదిస్తూ.. క్యాట్‌లో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని తెలిపారు. స్టే ఇవ్వొద్దని కోరారు. అయితే ధర్మాసనం ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు ఆమ్రపాలికి నోటీసులు జారీ చేసింది.

