విమానాల్లో తిరిగే ప్రముఖులే ఆ సింగర్ టార్గెట్.. తర్వాత ఏం చేస్తుందంటే

విమానాల్లో తిరిగే ప్రముఖులే ఆ సింగర్ టార్గెట్.. తర్వాత ఏం చేస్తుందంటే
  • ఉదయమే విమానంలో వెళ్లి.. సాయంత్రానికి తిరిగివెళ్తూ చోరీలు

హైదరాబాద్: ఆమె ఓ ప్రముఖ సింగర్, విమానాల్లో తిరిగే ప్రముఖులనే టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత వారిని వెంబడించి అదను దొరికితే చాలు వారి బ్యాగులు లేదంటే విలువైన వస్తువులు గాయబ్ చేసి మాయమైపోతుంది. గత ఆరు నెలలుగా పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్న ఈమె చివరకు ముంబైలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయంది. ఆమె వివరాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు షేర్ చేస్తే.. హైదరాబాద్ లోనూ ఆమె చోరీలు చేసినట్లు తేలింది. కరోనా ఎఫెక్ట్ తో అవకాశాలు లేక.. ఆర్ధిక ఇబ్బందులతో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సంచలనం సృష్టించిన ఆ సింగర్ పశ్చిమ బెంగాల్ లోని పరగణాల జిల్లాలకు చెందిన ముమూన్ హుస్సేన్ సినిమా అవకాశాలు రాక.. ఈవెంట్లలో పాడుతూ కాలం గడిపింది. అటు తర్వాత హైదరాబాద్ కు మకాం మార్చి డబ్బులు బాగా వస్తాయంటే క్లబ్బుల్లో.. బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా పాడడం మొదలుపెట్టింది. హైదరాబాద్ లో క్యాబరేలను నిషేధించడంతో ఆమెకు కష్టాలు పెరిగాయి. పెళ్లళ్లు, గణేష్ ఉత్సవాలు, దసరా నవరాత్రి ఉత్సవాల సీజన్లలో స్టేజీలపై కూడా పాడినా ఆర్ధిక ఇబ్బందులు తప్పలేదు. దీంతో చివరకు ప్రముఖ మహిళల హ్యాండ్ బ్యాగులు చోరీ చేసి పబ్బం గడుపుకోవడం మొదలుపెట్టింది. సింగర్ గా విమానాల్లో దేశమంతా తిరిగిన అనుభవంతో విమానాల్లో తిరిగేటప్పుడు అమాయకంగా కనిపించే ప్రముఖులనే టార్గెట్ చేసి వారి బ్యాగులు లేదంటే వారి వద్ద ఉండే విలువైన వస్తువులు కాజేసి వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకునేది. ఇలా ఆమె దేశమంతా ప్రముఖులను చాలా మందిని టార్గెట్ చేసి వారి బ్యాగులతో ఉడాయించడం అలవాటుగా చేసుకుంది. ఇదే కోవలో హీరో విశాల్ తల్లి జానకి హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ కు హాజరై బషీర్ బాగ్ లోని ఓ షోరూమ్ కు వెళ్లి చీరలు సెలెక్ట్ చేస్తుండగా.. సింగర్ మున్ మున్ హుసేన్ బ్యాగు కొట్టేసింది . బ్యాగులో రూ.65వేలకు పైగా నగదుతోపాటు 30 లక్షల విలువైన వజ్రాల నగలు, సెల్ ఫోన్ ఉండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో మున్ మున్ హుసేన్ ఆచూకీ  చిక్కడపల్లిలో నివాసం ఉంటూ తన పేరు రచనగా పరిచయం చేసుకుని నివసిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే కుందన్ బాగ్ కు చెందిన మరో ప్రముఖురాలు ఆదర్శ్ నగర్ లోని బాలాజీ గ్రాండ్ బజార్ లో షాపింగ్ కు వెళ్లగా ఆమె బ్యాగ్ ను కొట్టేసింది. ఈ కేసు విచారణలో కూడా మున్ మూన్ అరెస్టయింది. అబిడ్స్ తోపాటు.. అనేక చోట్ల ఇలాంటి కేసులు పెరగడంతో ఆమె పనేనని పోలీసుల అనుమానం. పోలీసులకు తనపై అనుమానం పెరగడంతో ఈ సింగర్ మున్ మూన్ బెంగళూరుకు మకాం మార్చి.. విమానాల్లో  దేశమంతా తిరుగుతూ ప్రముఖులను టార్గెట్ చేసి.. చోరీలకు పాల్పడుతూ తాజాగా ముంబై పోలీసులకు పట్టుబడింది. ఈమెపై కొన్ని కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ ఉండడంతో తమకు అప్పగించాలంటూ హైదరాబాద్ పోలీసులు మహారాష్ట్ర పోలీసులను సంప్రదించారు.

ఇవీ చదవండి

వాట్సప్ కొత్త పాలసీతో ఊపందుకున్నసిగ్నల్, టెలిగ్రామ్

పక్షుల సేఫ్టీ కోసం ఈ కైట్స్ ను వాడండి

బ్రౌన్‌ రైస్‌.. వైట్‌రైస్‌ ఏది మంచిది?

పాస్‌వర్డ్ మర్చిపోయిండు.. గుర్తురాకపోతే రూ.1,600 కోట్లు హుష్