రాంగోపాల్‌పేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై ఉన్నత స్థాయిలో చర్చలు

రాంగోపాల్‌పేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై ఉన్నత స్థాయిలో చర్చలు
  • మృతుల ఆచూకీ తెలియజేయకుండా కూలిస్తే ఇబ్బందులు వస్తాయని అధికారుల ఆందోళన

హైదరాబాద్‌, వెలుగు : సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట్‌లో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్‌ కూల్చివేతపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఎలాంటి ఆపరేషన్స్ నిర్వహించలేదు. బిల్డింగ్‌లో సజీవ దహనమైన మరో ఇద్దరు యువకుల ఆచూకీ లభించకపోవడంతో డైలమాలో పడ్డారు. బిల్డింగ్‌ను కూలిస్తే తలెత్తే పరిణామాల గురించి చర్చిస్తున్నారు. మరో రెండు డెడ్‌బాడీలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ రిపోర్ట్​పై ఆధారపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన తరువాత జీహెచ్‌ఎంసీ, ఫైర్  సర్వీసెస్‌  అధికారులు, పోలీసులు నాలుగు రోజుల పాటు బిల్డింగ్  అంతా వెతికారు. బిల్డింగ్‌ కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఆది, సోమవారం ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించే ప్రయత్నం కూడా చేయలేదు. డెడ్‌బాడీల కోసం అన్ని ఫ్లోర్లలో వెతికినా ఏమీ కనిపించకపోవడంతో గాలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. రెండ్రోజుల క్రితం లభించిన అవశేషాల్లోనే ముగ్గురికి సంబంధించి అవశేషాలు ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీని నిర్ధారణకు ఫోరెన్సిక్  రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఈ మూడింట్లో డీఎన్ఏ మ్యాచ్ అయితే తదపరి చర్యలు తీసుకోనున్నారు. అలాగే బిల్డింగ్ వెనకాల స్లాబులు కూలి కింద పడ్డాయి. వాటిని తొలగించేందుకు అవకాశం లేదు. దీంతో సెర్చ్ నిలిపివేశారు. 

రూల్స్ కు విరుద్ధంగా కట్టిన బిల్డింగుల వివరాలు సేకరించండి

అధికారులకు హోం మంత్రి మహమూద్ అలీ ఆదేశం

రూల్స్​కు వ్యతిరేకంగా నిర్మించిన భవనాల వివ రాలు సేకరించాలని అధికారులను హోం మంత్రి మహమూద్​ అలీ ఆదేశించారు. రాష్ట్రంలో జరు గుతున్న అగ్ని ప్రమాదాలపై అధికారులతో సోమ వారం ఫైర్ సర్వీసెస్​ హెడ్ ఆఫీసులో ఆయన సమావేశం నిర్వహించారు. సిటీలోని కమర్షియల్, రెసిడెన్షియల్  నిర్మాణాల్లో ఫైర్ సేఫ్టీ రూల్స్ పై చర్చించారు. నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. ట్రాఫిక్ రద్దీ ఉండే సికింద్రాబాద్  లాంటి  ఏరియాలో అలాంటి నిర్మాణాలు ఎక్కువ గా ఉన్నట్లు గుర్తించామని మంత్రికి చెప్పారు. అలాంటి బిల్డింగుల వివరాలు సేకరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.