రాష్ట్రంలో ఎండలు భగ్గుమనన్నాయి. మరో నాలుగు రోజులు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. 7 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్ కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మార్చి 30న కామారెడ్డ జిల్లా బిక్కనూరు మండలంలో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.
36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయితే ఎల్లో అలర్ట్, 41నుంచి 45 డిగ్రీల మధ్య ఉంటే ఆరెంజ్, 45 డిగ్రీల పైన ఉంటే రెడ్ అలర్ట్ ప్రకటిస్తుంది వాతావరణ శాఖ
