ఢిల్లీలో మరోసారి మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2026 అక్టోబర్ 07న ఇండియా కూటమి నేతలు సాగర్ రత్న హోటల్ లో భేటీ అయ్యారు. కూటమి నేతలతో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. సర్, సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
లంచ్ మీటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్నికల కమిషన్ కార్యాలయం వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారు కూటమి నేతలు. హోటల్ దగ్గర మూడు బస్సులు ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రసిడెండ్ ద్రౌపది ముర్మును కూడా కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హోటల్ దగ్గర మూడు బస్సులు ఏర్పాటు చేశారు.
ఈసీ కార్యాలయం వైపు వెళ్తున్న సాగర్ రత్న హోటల్ దగ్గర పోలీసులు, కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. మూడు బస్సుల్లో ఈసీ కార్యాలయానికి వెళ్తున్న కూటమి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హోటల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరోవైపు సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ తో పాటు ప్రధాని రాజీనామా చేయాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ రాజీనామా వరకు పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
