కడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితులు

కడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితులు

కడప జిల్లా తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సీ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గండికోట ముంపు నిర్వాసితుల ప‌రిహారం కోసం నాలుగు రోజులుగా ధర్నా చేస్తున్నారు. అయితే ధర్నా చేస్తున్న నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు ధర్నా ప్రాంతానికి పోలీసు బలగాలు భారీ ఎత్తున చేరుకున్నాయి. గ్రామంలో పెద్ద ఎత్తున మొహరించిన పోలీసు బలగాలు.. ద్వితీయ శ్రేణి నేతలతో పాటు మహిళల నిర్భంధించారు. బయటకు రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

ధ‌ర్నా చేస్తున్న ముంపు వాసులను జనసేన నేతలు పరామ‌ర్శించారు. బాధితులుగా అండగా ఉంటామని జనసేన రాయలసీమ పార్లమెంటరీ సంయుక్త కార్యదర్శి సుంకర శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యదర్శలు మాలే శివ, సురేష్ బాబు, తోట బాలసుబ్రహ్మణ్యం, నాగరాజు‌, సందీప్ పాల్గొన్నారు.

ఒక‌వేళ ప్రభుత్వం దిగి రాకపోతే జనసేనాని పవన్ రంగంలోకి దిగ‌నున్నారు. ఇప్పటికే గండికోట ముంపు వాసుల సమస్యపై స్పందించిన జనసేనాని.. సానుకూలంగా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సొంత‌ జిల్లాలోని ముంపువాసులపై దౌర్జన్యం చేయడం తగదని, బాధితులకు న్యాయం చేశాకే ముందుకెళ్లాలని సూచించారు.