
వరంగల్: హిజ్రాను ఓ వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన వరంగల్ లో జరిగింది. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన సురేష్ కార్ డ్రైవర్ గా పని చేస్తూ.. రామారంలో నివాసముంటున్నాడు. సురేష్ కు హిజ్రా (హరిబాబు)తో పరిచయం ఏర్పడింది. దీంతో హిజ్రా రోజూ సురేష్ ఇంటికి వస్తూ.. అతడిని డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేసేదట. ఈ క్రమంలోనే ఇద్దరి మద్య మాటమాట పెరగటంతో అవేశానికిలోనైన సురేష్.. హిజ్రాను కత్తితో పొడిచి చంపి ఉంటాడని తెలిపారు పోలీసులు. హరిబాబు(హిజ్రా) మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం ఎంజీఎంకు తరలించిన పోలీసులు.. సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు తెలిపారు పోలీసులు.