హిమాచ‌ల్ ప్రదేశ్లో బుర‌ద వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయిన జ‌నం

హిమాచ‌ల్ ప్రదేశ్లో బుర‌ద వ‌ర‌ద‌ల‌కు కొట్టుకుపోయిన జ‌నం

హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. వరదలు గ్రామాలను ముంచెతుతున్నాయి. నీట మునిగి పలు గ్రామాలు, రోడ్ల జలమయమయ్యాయి.  కొండచరియిలు విరిగి పడి ఇండ్లు, వాహనాలు ధ్వంసమవుతున్నాయి. దీంతో రహదారులను మూసివేస్తున్నారు అధికారులు. సోలన్‌లోని కందఘాట్ సబ్ డివిజన్‌లోని జాడోన్ గ్రామంలో మేఘాల విస్పోటనం జరిగి వర్షపు నీరు ఒక్కసారిగా ఉదృతంగా ప్రవహించడంతో  రెండు ఇళ్లు, ఒక గోశాల కొట్టుకుపోయాయి. ఏడుగురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. 


భారీవర్షాలపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వాందర్ సింగ్ స్పందించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఆగస్టు 13 న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు,  కళాశాలలను ఆగస్టు 14 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. సోలన్ జాడోన్ లో మృతుల కుటుంబాలకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖూ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. వెంటను వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

క్లౌడ్‌బర్స్ట్ ఫలితంగా  సోలన్‌లోని కందఘాట్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని కందఘాట్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) సిద్ధార్థ ఆచార్య  వెల్లడించారు.  మరో ముగ్గురు వ్యక్తులు తప్పిపోయినట్లు చెప్పారు. వరదల్లో కొట్టుకుపోతున్న ఐదుగురిని రక్షించామని సిద్ధార్థ ఆచార్య తెలిపారు.  

గత రాత్రి నుంచి  హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లు మూసుకుపోయి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితులను అంచనా వేసిన అధికారులు.. సిమ్లా- చండీగఢ్ రహదారిని మూసివేశారు. 


ఓ  దేవాలయంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటన చాలా మందిని చిక్కుకుపోయారని సిమ్లాలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజీవ్ కుమార్ గాంధీ అన్నారు. ఆలయంపై కొండచరియలు విరిగి పడటంతో సమీపంలోని భవనాల భద్రతపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 


మరోవైపు మండి జిల్లాలో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చండీగఢ్-మనాలి జాతీయ రహదారి పూర్తిగా మూసి వేశారు అధికారులు. ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా రాకపోకలు బంద్ చేశారు.  జిల్లాలో చాలా వరకు అన్ని రహదారులు మూసుకుపోయాయి. విద్యుత్, నీటి సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. 

జూన్ 24న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హిమాచల్ లో కురిసిన భారీ వర్షాలకు రూ.  7,020 కోట్ల నష్టం  వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు , రోడ్డు ప్రమాదాల తో ఇప్పటివరకు 257 మంది మరణించినట్లు అధికారులు నివేదికలు చెబుతున్నాయి. 
రానున్న రోజుల్లు హిమాచల్ లో భారీ వర్షపాత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆగస్టు 17 వరకు భారీవర్షాలు, ఆగస్టు 19 వరకు వాతావరణ తడిగా  ఉంటుందని ఐఎండీ సూచించింది.