అస్సాం సీఎం అభ్యర్థిగా హిమంత బిశ్వా శర్మ

అస్సాం సీఎం అభ్యర్థిగా  హిమంత బిశ్వా శర్మ

అస్సాం సీఎంగా హిమంత బిశ్వా శర్మను ఖరారు చేసింది బీజేపి అధిష్టానం. దీంతో ఆరు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడింది. అస్సాం బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా హిమంత ఎన్నికైనట్లు ప్రకటించారు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్. సోమవారం హిమంత బిశ్వా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో బీజేపీ సొంతంగా 60 స్థానాల్లో విజయం సాధించగా...మిత్ర పక్షాలు AGP 9, UPPL 6 స్థానాల్లో గెలిచాయి.

అస్సాం సీఎం పదవి కోసం సోనోవాల్, హిమంత బిశ్వాల మధ్య పోటీ నడిచింది. ఐతే చివరకు హిమంత బిశ్వా వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. 2001 నుంచి 2015 వరకు జలుక్బరి నియోజకవర్గం నంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు హిమంత. తర్వాత కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరారు. తర్వాత సోనోవాల్ కేబినెట్లో కీలకమైన ఆర్థిక, వైద్య, విద్య శాఖలకు మంత్రిగా పని చేశారు. ఇప్పటికే సర్బనంద సోనోవాల్ తన రాజీనామాను గవర్నర్ జగదీశ్ ముఖికి అందించారు.