జంట జలాశయాలు గేట్లు ఓపెన్ చేయడంతో మూసీకి వరద ఒక్కసారిగా పెరిగింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ కు 9 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా.. అధికారులు 8 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి 10,700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 3,900 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.693 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 8వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండటంతో 13 గేట్లను 6 ఫీట్ల మేర ఎత్తి 8281 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జంట జలాశయాలు నుంచి నీటిని విడుదల చేయడంతో మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. దీంతో 8 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మూసీ ప్రాజెక్టుకు 6348.30 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా.. ఔట్ ఫ్లో 9,956. 46 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులుకాగా.. ప్రస్తుత 637 అడుగుల మేర వరద నీరు చేరింది. మూసీ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు ఉండగా.. ఇప్పటి వరకు 2.57 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
