
గండిపేట, వెలుగు: సిటీ జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్‌కు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఈ జలాశయాలకు వరద నీరు పెరుగుతోంది. దీంతో జలమండలి అధికారులు జలాశయాల గేట్లను ఎత్తి నీటిని మూసీలోకి వదిలిపెట్టారు. ఉస్మాన్‌సాగర్ ఫుల్ట్యాంక్ లెవల్ 1,790 అడుగులు కాగా, ప్రస్తుతం 1,789.90 అడుగుల నీరు చేరింది.
హిమాయత్‌సాగర్ ఫుల్ట్యాంక్ లెవెల్ 1,763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1,763.50 అడుగులు నీటి నిల్వ ఉంది. ఈ క్రమంలోనే బుధవారం హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి 1,365 క్యూసెక్కులు, ఉస్మాన్ సాగర్ నుంచి రెండు గేట్లు ఎత్తి 460 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.