
న్యూఢిల్లీ: అల్యూమినియం, రాగి తయారు చేసే ఆదిత్య బిర్లా గ్రూప్ మెటల్ ఫ్లాగ్‌షిప్ హిందాల్కో ఇండస్ట్రీస్ నికరలాభం (కన్సాలిడేటెడ్) ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో 66 శాతం పెరిగి రూ.5,284 కోట్లకు చేరుకుందని తెలిపింది.
గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం రూ.3,174 కోట్లు ఉంది. ఈ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.64,890 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.55,994 కోట్లు వచ్చాయి.
మార్చి 2025తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్ నికరలాభం రూ.16,002 కోట్లకు పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.10,155 కోట్ల నికరలాభం వచ్చింది. మొత్తం ఆదాయం రూ.2,15,962 కోట్ల నుంచి రూ.2,38,496 కోట్లకు పెరిగింది.