
హైదరాబాద్, వెలుగు: హింద్వేర్ గ్రూప్ బ్రాండ్ ట్రూ ఫ్లో బై హింద్వేర్ రూర్ఖీలో తన అత్యాధునిక తయారీ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్‌లో ట్రయల్ ప్రొడక్షన్ కూడా విజయవంతంగా మొదలయింది. ఇది ట్రూఫ్లో ఉత్పత్తులను తయారు చేస్తుందని, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడానికి సహాయపడుతుందని హింద్వేర్ తెలిపింది.
ఇక్కడ ప్లాస్టిక్ పైపులు, ఫిట్టింగులు తయారు చేస్తామని, ఈ విస్తరణతో కంపెనీ మరింత వృద్ధి చెందుతుందని హింద్వేర్ పేర్కొంది.