పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై హిస్టరీ షీట్ ఓపెన్

పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై హిస్టరీ షీట్ ఓపెన్

తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. అదే విధంగా సోషల్ మీడియా ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడే వారిని ట్రాక్ చేయాలని డిసైడ్ అయ్యింది. 

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ భావిస్తోంది. సైబర్ నేరగాళ్లతోపాటు సోషల్ మీడియాలో పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని నిర్ణయించింది.

సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రకటనలు , తప్పుడు వ్యాఖ్యానాలు , ఆర్థిక నేరాలు చేసే వారిపై దృష్టిపెట్టనుంది. వర్గాలను రెచ్చగొట్టడం, ఉద్దేశ పూర్వకంగా వ్యక్తులపై తప్పుడు కథనాలను ప్రచారం చేయడం మొదలైన అంశాలపై ఇకనుంచి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు పోలీసులు. పదేపదే నేరాలు చేస్తున్న వారిని గుర్తించి హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.