కొత్త పోస్టర్ తో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

కొత్త పోస్టర్ తో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

విశ్వక్ సేన్ హీరోగా, శైలేష్ కొల‌ను డైరక్షన్ లో వచ్చిన  క్రైం ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్ మూవీ 'హిట్'. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా పెద్ద సక్సెస్ ను సాధించింది. రిలీజ్ టైమ్ లోనే సినిమాకు సీక్వెల్‌గా 'హిట్ 2' ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. అయితే.. ఇందులో కూడా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, ఆ ప్లేస్ లోకి అడివి శేష్ వచ్చాడు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నేచురల్ స్టార్ నాని సమర్పణలో రూపొందుతున్న ఈ  సీక్వెల్‌ లో మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. చాలా రోజుల త‌ర్వాత ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 2న మూవీని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. రావు రమేశ్‌, భానుచంద‌ర్‌, పోసాని కృష్ణముర‌ళి, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, శ్రీనాథ్ మాగంటి, కోమ‌లీ ప్రసాద్ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. సినిమాపైన ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి.